
సాక్షి, అనంతపురం: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ జిల్లా పర్యటన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నారాయణ పర్యటనను విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. అదేవిధంగా అధిక ఫీజులపై మాజీ మంత్రి నారాయణను విద్యార్థి సంఘాల నేతలు నిలదీశారు. ఈ క్రమంలో విద్యార్థిసంఘం నేతలపై నారాయణ అనుచరులు దాడికి దిగారు. దీంతో విద్యార్థులు ఎదురుదాడి చేయటంతో ఆ ఘటనలో నారాయణ చొక్కా చిరిగిపోయింది. కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. విద్యార్థులు అడ్డుకొని నిరసన చేయటంతో నారాయణ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తమపై దాడికి పాల్పడ్డ మాజీ మంత్రి నారాయణ, అతని అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.