అందరిముందు ఇన్విజిలేటర్ తనను పట్టుకుని, చెక్ చేశారన్న ఆవేదనతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది.
అందరిముందు ఇన్విజిలేటర్ తనను పట్టుకుని, చెక్ చేశారన్న ఆవేదనతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన విజయవాడలో జరిగింది. విజయవాడలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతున్న మణికంఠ అనే ఈ విద్యార్థి మాస్ కాపీయింగ్ చేస్తూ పట్టుబడినట్లు కళాశాల వర్గాలు చెబుతున్నాయి. అయితే, కేవలం మానసికంగా తీవ్రంగా వేధించడం వల్ల మాత్రమే మణికంఠ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
ఇన్విజిలేటర్ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. మణికంఠ కుటుంబాన్ని నైతికంగా, ఆర్థికంగా ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా, తమ కుమారుడిది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్య చేసుకునే మనస్తత్వం కాదని, దీని వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుదని అతడి తల్లిదండ్రులు అన్నట్లు కూడా చెబుతున్నారు.