
వైవీయూ: వైఎస్సార్ జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయంలో గుడ్లగూబను పోలిన ఓ వింత పక్షి కనిపించింది. వైవీయూ నుంచి గురుకులం వెళ్లే దారిలో గాయపడి ఉన్న ఈ పక్షిని తెలుగు విభాగం ఆచార్యులు తప్పెట రామప్రసాద్‌రెడ్డి, పరిశోధక విద్యార్థులు హిమాచలం, నరేష్, గంగాధర్‌రెడ్డిలు గుర్తించారు. వెంటనే వైవీయూ జంతుశాస్త్రం విభాగం వారికి పక్షిని అప్పజెప్పారు. ఈ పక్షి చూసేందుకు కాస్త గుడ్లగూబ ఆకృతిలోను, ముఖం మనిషిని పోలిన విధంగా ఉండటంతో పలువురు విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.