రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు సన్నాహాలు | Statewide football tournament preparations | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు సన్నాహాలు

Oct 25 2013 3:34 AM | Updated on Oct 2 2018 8:39 PM

రాష్ట్ర స్థాయి సీని యర్ ఫుట్‌బాల్ పోటీలకు రామకృష్ణాపూర్ వేది క కానుంది. నాలుగు రోజులపాటు జరిగే క్రీడాసంరంభానికి సింగరేణి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఏడేళ్ల విరామం తర్వాత ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తుం డడంతో క్రీడాకారుల్లో ఆనందం వెల్లివిరుస్తోం ది.

రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్ : రాష్ట్ర స్థాయి సీని యర్ ఫుట్‌బాల్ పోటీలకు రామకృష్ణాపూర్ వేది క కానుంది. నాలుగు రోజులపాటు జరిగే క్రీడాసంరంభానికి సింగరేణి అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఏడేళ్ల విరామం తర్వాత ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తుం డడంతో క్రీడాకారుల్లో ఆనందం వెల్లివిరుస్తోం ది. వచ్చే నెల 15 నుంచి రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 22 జిల్లాల నుంచి సుమారు 550 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. పోటీల కోసం స్టేడియంలో రెండు కోర్టులు నిర్మించాలని నిర్ణయిం చారు. ప్రధానంగా భోజనం, వసతి, సింగరేణి పాఠశాలల భవనాల్లో క్రీడాకారులకు వసతి కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
  రామకృష్ణాపూర్‌తోపాటు శ్రీరాంపూర్, మంచిర్యాలలో నూ రెండేసి మ్యాచ్‌లు నిర్వహించాలని అధికారులు యోచిస్తున్నారు. పోటీల నిర్వహణకు 60 మంది అంపైర్లను ఆహ్వానిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన సంతోష్ ట్రోఫీ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును సైతం ఇదే వేదిక నుంచి ఎంపిక చేస్తారు. ఎంపికైన రాష్ట్ర జట్టు జాతీయ స్థాయి సీనియర్ ఫుట్‌బాల్ పోటీల్లోనూ పాల్గొనే అవకాశాలున్నాయి. సింగరేణి కాలరీస్ మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ వెంకట్రామయ్య నిర్వాహక కమిటీ చైర్మన్, చీఫ్ ప్యాట్రన్‌గా స్థానిక ఎమ్మెల్యే నల్లాల ఓదెలు వ్యవహరిస్తారు. ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులు ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు.
 
 ఏడేళ్ల అనంతరం పోటీలు
 రాష్ట్రంలో సీనియర్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఏడేళ్ల విరామం తర్వాత జరుగుతున్నాయి. 2007 నుంచి ఇప్పటివరకు పోటీలు అధికారికంగా జరగలేదు. ఫుట్‌బాల్ అసోసియేషన్‌లో చిన్న చిన్న గొడవలు అప్పట్లో వివాదానికి తెరతీశాయి. ఆ విభేదాలు కాస్త న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లడంతో క్రీడల నిర్వహణకు అవాంతరం ఏర్పడింది. ఎట్టకేలకు వివాదం స ద్దుమణగడం, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం తో క్రీడల నిర్వహణకు మార్గం సుగమమైంది.
 
 స్టేడియంను పరిశీలించిన ఎమ్మెల్యే, జీఎం
 పోటీల నిర్వహణ కోసం స్టేడియాన్ని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఏరియా జనరల్ మేనేజర్ వెంకట్రామయ్య గురువారం పరిశీలించారు. క్రీడల నిర్వహణకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఎంతమంది క్రీడాకారులు వస్తున్నారు, వారికి ఎక్కడెక్కడా భోజనం, వసతి ఏర్పాట్లు చేయాలన్న దానిపై సమీక్షించారు. వారి వెంట స్థానిక సర్పంచ్ జాడి శ్రీనివాస్, రాష్ట్ర ఫుట్‌బాల్ అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏరియా ఉపాధ్యక్షుడు జె.రవీందర్, డీవైజీఎం(పర్సనల్) ముజాహిద్, ఎస్టేట్ అధికారి గంగాధర్, వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్(డబ్ల్యూపీఎస్‌జీఏ)ఏరియా కార్యదర్శి సుదర్శన్, స్పోర్ట్స్ అసిస్టెంట్ సూపర్‌వైజర్ అశోక్, స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్స్ చిన్నయ్య, ఈశ్వరచారి ఉన్నారు.
 
 సమర్థవంతంగా నిర్వహిస్తాం
 పోటీలను సమర్థవంతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వివిధ రంగాల్లో స్థిరపడిన సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో పోటీలు నిర్వహిస్తాం. స్నేహాపూరిత వాతావరణంలో క్రీడల నిర్వహణ చేపడతాం.
 - పిన్నింటి రఘునాథ్‌రెడ్డి, రాష్ట్ర ఫుట్‌బాల్
 అసోసియేషన్ సంయుక్త కార్యదర్శి
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement