కొండపై నిండుకుంటున్న జలాశయాలు | Srivari devotees of water up to 165 days | Sakshi
Sakshi News home page

కొండపై నిండుకుంటున్న జలాశయాలు

Nov 17 2016 1:50 AM | Updated on Sep 4 2017 8:15 PM

కొండపై నిండుకుంటున్న జలాశయాలు

కొండపై నిండుకుంటున్న జలాశయాలు

శేషాచలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తిరుమలకొండ మీద గోగర్భం, ఆకాశగంగ డ్యాములు ఎండాయి.

శ్రీవారి భక్తులకు 165 రోజుల వరకే నీళ్లు

 సాక్షి, తిరుమల: శేషాచలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తిరుమలకొండ మీద గోగర్భం, ఆకాశగంగ డ్యాములు ఎండాయి. ఇక పాపవినాశనం, కుమారధార-పసుపుధార జంట ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు భారీగా తగ్గాయి.  కారణంగా తిరుమలలో కేవలం 165 రోజులకు సరిపడా నీటి నిల్వలున్నాయి. ఈ లోపు వర్షాలు పడకుంటే ఏప్రిల్ నెలనుంచి శ్రీవారి భక్తులకు నీటి కష్టాలు మొదలవుతాయి. స్వామి దర్శనంకోసం రోజూ 70 వేల మంది భక్తులు వస్తుంటారు.

భక్తుల అవసరాలతోపాటు  ఆలయం, నిత్యాన్న ప్రసాదం కోసంరోజూ 32 లక్షల గ్యాలన్లు నీరు వాడుతుంటారు. గత ఏడాది నవంబరు 7,8,9 తేదీల్లో మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు తిరుమలలోని ఐదు జలాశయాలు పూర్తిగా నిండారుు. ఆ నీటిని వినియోగించటంతో రెండు డ్యాములు ఎండిపోగా, మిగిలిన మూడు డ్యాముల్లో నీటి నిల్వలు బాగా తగ్గారుు. దీంతో టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది. నీటివాడకంలో నిర్దిష్ట విధానాలు అమలు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement