శ్రీశైలభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 29 నుంచి శ్రీచండీ సప్తశతి (దేవీమహాత్యం)పై సమన్వయ సరస్వతిగా ప్రసిద్ధులైన ప్రఖ్యాత ప్రవాచకులు సామవేదం షణ్ముఖశర్మచే ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు ఈఓ సాగర్‌బాబు ఆదివారం తెలిపారు.
కర్నూలు (శ్రీశైలం): శ్రీశైలభ్రమరాంబా మల్లికార్జునస్వామి వార్ల ఆలయ ప్రాంగణంలో ధర్మప్రచారంలో భాగంగా ఈ నెల 29 నుంచి శ్రీచండీ సప్తశతి (దేవీమహాత్యం)పై సమన్వయ సరస్వతిగా ప్రసిద్ధులైన ప్రఖ్యాత ప్రవాచకులు సామవేదం షణ్ముఖశర్మచే ప్రవచనాలు ఏర్పాటు చేసినట్లు ఈఓ సాగర్‌బాబు ఆదివారం తెలిపారు.
అక్కడ మహాదేవి అలంకార మండపంలో ఏడు రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 6.30 గంటల నుంచి ప్రవచనాలను వినిపిస్తారన్నారు. చండీ సప్తశతిని వ్యాస మహర్షి రచించిన మార్కండేయ పురాణంలోని ఒక భాగమని అన్నారు. భక్తులు, స్థానికులు ఈప్రవచాలను హాజరై స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.