త్వరలోనే భారీ ఎత్తున కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ | Soon a large-scale recruitment of constables | Sakshi
Sakshi News home page

త్వరలోనే భారీ ఎత్తున కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్

Dec 28 2014 2:23 AM | Updated on Mar 19 2019 6:01 PM

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఇతర అవసరాలకు భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్న పోలీసు శాఖ

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఇతర అవసరాలకు భారీ ఎత్తున పోలీస్ కానిస్టేబుళ్ల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. కనీసం 6 నుంచి 7 వేల మంది కానిస్టేబుళ్లు అవసరమవుతారంటూ ప్రభుత్వానికి ఉన్నతాధికారులు ప్రతిపాదించనున్నారని తెలిసింది. ఇందులో సగం మందిని నియమించుకోవడానికి  ప్రభుత్వం అంగీకరిం చినా చాలని యోచనలో ఉన్నారు. వారం రోజుల్లో ప్రతిపాదనలను పంపించడానికి డీజీపీ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement