'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు' | somireddy chandra mohan reddy slams owaisi brothers | Sakshi
Sakshi News home page

'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు'

Jan 6 2015 6:10 PM | Updated on Oct 22 2018 8:50 PM

'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు' - Sakshi

'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు'

హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు.

ప్రతి భారతీయుడు ముస్లింగానే పుడుతున్నారని, తర్వాతే మతం మారుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇటువంటి వారిని 'ఘర్ వాపసీ' ద్వారా మళ్లీ ముస్లింలుగా మార్చాలని అన్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement