breaking news
Ghar wapasi
-
మోదీ హవా ‘వాపసీ’!
హిందూశక్తుల ఘర్ వాపసీ వంటి చర్యలతో తగ్గుతున్న ప్రధాని ప్రభ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 27 సీట్లు కోల్పోనున్న బీజేపీ తొమ్మిది స్థానాలను అదనంగ గెల్చుకోనున్న కాంగ్రెస్ నరేంద్రమోదీ.. ఒక ప్రభంజనం.. ఒక సునామీ..! 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో వినిపించిన మాటలివీ!! అందుకు తగ్గట్టే ఆ ఎన్నికల్లో మోదీ దుమ్మురేపారు. కమలం పార్టీకి ఒంటిచేత్తో అంఖండ విజయాన్ని సాధించిపెట్టారు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించారు. అధికార పగ్గాలు చేపట్టి ఇప్పటికీ దాదాపు 300 రోజులు గడిచిపోయాయి. మరి ఇప్పుడు మోదీని ప్రజలు ఎలా చూస్తున్నారు? వారి ఆశలు, ఆకాంక్షలను ప్రధానిగా మోదీ ఎంత మేరకు నెరవేర్చారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతుందా..? మాటల మాంత్రికుడుడి హవా ఏమైనా తగ్గిందా..? ఈ అంశాల ఆధారంగా ఇండియా టుడే-సిసిరో తాజాగా ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో క్రమంగా మోదీ హవా తగ్గుతున్నట్టు తేలింది. ప్రధానంగా ఆయన అధికారం చేపట్టాక హిందూవాద సంస్థలు చేపట్టిన ‘ఘర్ వాపసీ’ వంటి చర్యలతో మోదీ ప్రభ మసకబారినట్టు సర్వేలో స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నెగ్గిన 282 సీట్లలో 27 సీట్లు కోల్పోతుందని తేలింది. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లోని 260 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 12 వేల మందిని ఈ సర్వేలో భాగస్వాములను చేశారు. ప్రధానిగా మోదీ పనితీరు పట్ల 38 శాతం మంది బాగుందని చెప్పగా, 22 శాతం మంది ‘చాలా బాగుంది’ అని అభిప్రాయపడ్డారు. 11 శాతం మంది ప్రధాని పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కాగా, కాంగ్రెస్ క్రమంగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మొన్నటి ఎన్నికల కన్నా అదనంగా మరో తొమ్మిది స్థానాలను గెల్చుకుంటుందని సర్వే తెలిపింది. ప్రధానిగా ఎవరు కావాలి? ఇప్పుడు 2014 ఆగస్టు నరేంద్రమోదీ 36 57 అరవింద్ కేజ్రీవాల్ 15 3 జయలలిత 7 3 రాహుల్‌గాంధీ 7 6 సోనియాగాంధీ 5 5 నిజాయితీగల నాయకుడెవరు? ఇప్పుడు 2014 ఆగస్టు మోదీ 31 36 కేజ్రీవాల్ 18 4 అద్వానీ 5 3 సోనియాగాంధీ 5 5 రాహుల్ 5 4 -
'బీజేపీ నాయకుల చెల్లెళ్లు, కూతుళ్లను తిరిగి రప్పించండి'
ఫైజాబాద్(యూపీ): బీజేపీ నాయకుల "ఘర్ వాపసీ'' ప్రచార కార్యక్రమంపై సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ సింగ్ యాదవ్ ఘాటుగా స్పందించారు. మతం మార్చుకొని పెళ్లాడిన తమ చెల్లెల్లు, కూతుళ్లను బీజేపీ నాయకులు తిరిగి హిందూ మతంలోకి రప్పిస్తేనే వారు చేపట్టిన కార్యక్రమానికి అర్ధం ఉంటుందన్నారు. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే తేజ్ నరైన్ తమ్ముని వివాహానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే బీజేపీ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన భారీ అభివృద్ధి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యిందని.. ఇప్పుడు ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఘర్ వాపసీ కార్యక్రమం అని ఆయన ఎద్దేవా చేశారు. -
'ఓవైసీ సోదరులు అలా మాట్లాడడం తగదు'
హైదరాబాద్: హిందువులను కించపరిచేవిధంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఒవైసీ సోదరులు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. గతంలో కూడా హిందువులను అవమానించేలా ఓవైసీ సోదరులు మాట్లాడారని గుర్తు చేశారు. అందరూ కలిసివుండాలన్నదే తమ అభిప్రాయమని చెప్పారు. ప్రతి భారతీయుడు ముస్లింగానే పుడుతున్నారని, తర్వాతే మతం మారుతున్నారని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇటువంటి వారిని 'ఘర్ వాపసీ' ద్వారా మళ్లీ ముస్లింలుగా మార్చాలని అన్నారు. అసదుద్దీన్ వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.