మంత్రి పర్యటనలో పాము కలకలం

Snake Halchal In Minister Shankar Narayana Meeting At Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : మంత్రి శంకర్‌ నారాయణ పాల్గొన్న స్పందన కార్యక్రమంలో పాము కలకలం సృష్టించింది. మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. సిబ్బంది అప్రమత్తంతో మంత్రికి ప్రమాదం తప్పింది. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలొ మంత్రి శంకర్‌నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను మంత్రికి విన్నవించుకున్నారు. అనంతరం మంత్రి ప్రజలతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా పాము దూసుకొచ్చింది. ఓ వ్యక్తి కాలు దగ్గర వచ్చి ఆగింది. ఆ వ్యక్తి పామును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. వెంటనే కాలుకు ఉన్నచెప్పును విసిరి దూరంగా పరుగెత్తాడు. దీంతో పాము ప్రజల్లోకి దూసుకెళ్లింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. అప్రమత్తమైన సిబ్బంది మంత్రి శంకర్‌నారాయణను సురక్షితంగా ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ పాము రోడ్డు మీదగా పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top