నిత్యం..నీ నామ స్మరణం | Smaranam your name daily | Sakshi
Sakshi News home page

నిత్యం..నీ నామ స్మరణం

Jul 6 2014 12:31 AM | Updated on Sep 2 2017 9:51 AM

నిత్యం..నీ నామ స్మరణం

నిత్యం..నీ నామ స్మరణం

ఈ కుందనపు బొమ్మ పేరు బోడపాటి ప్రసన్నదేవి. పక్కనున్న పంచలోహ విగ్రహం ఆమె రూపంలో తయారు చేసిన ప్రతిమ. అదేంటి అచ్చం ఆమెలాంటి ప్రతిమ చేశారెందుకని

ఈ కుందనపు బొమ్మ పేరు బోడపాటి ప్రసన్నదేవి. పక్కనున్న పంచలోహ విగ్రహం ఆమె రూపంలో తయారు చేసిన ప్రతిమ. అదేంటి అచ్చం ఆమెలాంటి ప్రతిమ చేశారెందుకని డొటొస్తోంది కదూ. ఆమె ఈ లోకాన్ని వీడి సరిగ్గా 14 నెలలైంది. విషయంలోకి వెళితే... భీమవరం పట్టణానికి చెందిన బోడపాటి రవితేజ (చినబాబు), దుర్గాదేవి దంపతుల గారాలపట్టి ప్రసన్నదేవి. 20 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఆప్యాయత, అనురాగాలను కురిపించింది. 1992 ఆగస్టు 2న జన్మించిన ఆమె గత ఏడాది మే 6వ తేదీన కుటుంబ సభ్యుల్ని శోకసముద్రంలో ముంచి స్వర్గానికి పయనమైంది. ప్రసన్నదేవి జ్ఞాపకాలను వీడలేని తల్లిదండ్రులు ఆమె రూపంలో ఇలా పంచలోహ విగ్రహం తయూరు చేయించి ఇంట్లోని పూజా మందిరంలో ప్రతిష్టించారు. నిత్యం పూజలు చేస్తున్నారు. ఇంటిని ఆమె ప్రతిరూపాలతో నింపేశారు. ప్రతిక్షణం ప్రసన్నదేవి నామాన్ని స్మరిస్తూ.. మధుర సృ్మతులను నెమరు వేసుకుంటున్నారు. ఆమె పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement