వైవీ సుబ్బారెడ్డిని కలిసిన ప్రముఖ గాయని శోభారాజు

Shobha Raju Meets TTD Chairman YV Subba Reddy - Sakshi

సాక్షి, తిరుమల : ప్రముఖ గాయని పద్మశ్రీ శోభారాజు టీడీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిశారు. టీటీడీలో పాటలు పాడే అవకాశాన్ని తనకు ఇవ్వాలని శోభారాజు కోరారు. శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్‌ (ఎస్వీబీసీ)లో తప్పకుండా అవకాశం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. నలభై ఏళ్లుగా నిస్వార్థంగా సేవలు అందిస్తున్నా.. టీటీడీ నుంచి సరైన గుర్తింపు లభించలేదని చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీటీడీ తనకు ప్రకటించిన ఆస్థాన విద్వాంసురాలు పదవి కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీలో తన సేవలను ఉపయోగించుకుంటామని చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు శోభారాజ్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top