పదేళ్ల బాలికపై లైంగిక దాడి | Sexual assault on the ten years old girl | Sakshi
Sakshi News home page

పదేళ్ల బాలికపై లైంగిక దాడి

Sep 9 2014 3:26 AM | Updated on Jul 23 2018 9:13 PM

పదేళ్ల బాలికపై లైంగిక దాడి - Sakshi

పదేళ్ల బాలికపై లైంగిక దాడి

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.

యానాం టౌన్ :  కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో పదేళ్ల బాలికపై 25 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్పీ దాట్ల వంశీధరరెడ్డి కథనం ప్రకారం... యానాంలో ఆదివారం మధ్యాహ్నం వినాయక చవితి పందిరి వద్ద ఉన్న బాలికను.. ఎలిపే రాజేష్ అనే యువకుడు గేమ్స్ ఆడడానికి సెల్‌ఫోన్ ఇస్తానని తన ఇంటికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని తల్లికి ఆ బాలిక చెప్పగా.. ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement