నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత | severe tense situation at nandyala | Sakshi
Sakshi News home page

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత

Nov 1 2014 7:39 AM | Updated on Oct 19 2018 8:11 PM

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత - Sakshi

నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం కేసు పెట్టడంతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. భూమా నాగిరెడ్డి ఇంటి చుట్టూ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. అయితే నాగిరెడ్డి ప్రస్తుతం అందుబాటులో లేరు. జిల్లా ఎస్పీ స్వయంగా నంద్యాలకు చేరుకుని ప్రత్యక్షంగా పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ నంద్యాల బంద్కు పిలుపునిచ్చింది. శుక్రవారం నాటి మున్సిపల్ సమావేశంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు రాత్రికి మరింత తీవ్రంగా మారాయి. దాంతో నంద్యాల అంతా ఇప్పుడు టెన్షన్ వాతావరణం నెలకొంది. అసలు సంఘటనతో ఎలాంటి సంబంధం లేని సుబ్బారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై పోలీసులను అడిగినా ఎలాంటి సమాధానం రావట్లేదు. ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement