ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు

Seventh Class Girl Suffering With Kidney Infection in Visakhapatnam - Sakshi

ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి లతాశ్రీ

ఫిజియోథెరపీతో నయం చేస్తామన్న వైద్యులు

రోజుకు రూ. రెండు వేల ఖర్చు

దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు

మర్రిపాలెం (విశాఖ ఉత్తరం): పసి హృదయం ప్రాణాంతక వ్యాధితో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. వైద్యానికి అవసరమైన సాయం అందించే చేతులకోసం ఆశగా ఆ కుటుంబం ఎదురు చూస్తోంది. విశాఖ నగరంలోని బర్మా క్యాంపులో నివాసం ఉంటున్న కానూరి కోటేశ్వరరావు, వరలక్ష్మి  దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఏడవ తరగతి చదువుతున్న లతాశ్రీ యూరిన్‌ బ్లాడర్‌లో పెరాల్సిస్‌ స్ట్రోక్‌ రావడం వల్ల దాని ప్రభావం కిడ్నీపై చూపింది. దీనివల్ల ఆమె తరచూ జ్వరంతో బాధపడుతోంది. కిడ్నీకి ఇన్‌ఫెక్షన్‌ సోకే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చూపిస్తే శస్త్ర చికిత్స అసాధ్యమని వైద్యులు చెప్పినట్టు వారు తెలిపారు.

మందులు వాడుతున్నా వ్యాధి తగ్గుముఖం పట్టకపోవడంతో లతాశ్రీని ఎంవీపీ కాలనీలో ఫిజియెథెరపీ కేంద్రంలో పరీక్షలు చేయించారు. ఫిజియోథెరపీ ద్వారా నయం చేస్తామని అక్కడ హామీ ఇచ్చినట్టు వారు వివరించారు. అయితే ఫిజియోథెరపీ ఖర్చుతో కూడినది కావడంతో వారు దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రోజుకు రూ.2 వేలు ఖర్చు అవుతుందని రెండు నెలలపాటు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని అక్కడి వైద్యులు చెప్పినట్టు లతాశ్రీ తల్లిదండ్రులు తెలిపారు. ఇంత మొత్తం భరించడం వాళ్లకు తలకు మించినదిగా మారింది. లతాశ్రీ తండ్రి ఆటో డ్రైవర్‌గా, తల్లి  ఇళ్లల్లో పనిచేస్తూ వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. రెక్కాడితేనే గాని డొక్కాడని పరిస్థితుల్లో తాము ఫిజియోథెరపీ చేయించే స్థోమత లేదని వారు వాపోతున్నారు. దాతలు ముందకు వచ్చి ఫిజియోథెరపీకి అవసరమైన మొత్తాన్ని అందించి తమ కుమార్తె ప్రాణాలు కాపాడాలని వారు కోరుతున్నారు. వివరాలకు 9010943730 నంబరులో సంప్రదించాలని వారు తెలిపారు.

ఫిజియోథెరపీ చేయించాలి
మా మమ్మీ,డాడీల బాధ నన్ను మరింత మనోవేదనకు గురి చేస్తోంది.  నేను వ్యాధి నుంచి బయట పడితే అందరిలా విద్యలో రాణించి వారికి కొండంత అండగా ఉందామనుకున్నాను. వైద్యానికి సాయం అందించే వారు (ఐఎఫ్‌ఎస్‌సీ: ఎస్‌బీఐ ఎన్‌0020573, ఖాతా: 36749638537, ఐటీఐ బ్రాంచి) నంబరులో జమచేసి ఆదుకోవాలి. – లతాశ్రీ, బాధిత చిన్నారి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top