ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు | seven injured in east godavari district road accident | Sakshi
Sakshi News home page

ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

Jan 31 2016 11:04 AM | Updated on Aug 30 2018 3:58 PM

తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి.

కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. రావులపాలెం మండలం ఈతకోట టోల్‌గేట్ వద్ద ఆగి ఉన్న ట్యాంకర్ను వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది.

బస్సు వెనుకనే వస్తున్న ఓ కారు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితోపాటు బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు  గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ, తణుకు, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement