ఏపీ సెట్‌ దరఖాస్తుకు ఈ నెల 11 తుది గడువు

September11 Last Date for Filing APSET 2019 Forms - Sakshi

రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్‌) దరఖాస్తుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుందని ఏపీ సెట్‌ మెంబర్‌ సెక్రెటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.

సాక్షి, ఏయూ క్యాంపస్‌ (విశాఖ తూర్పు): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్‌) దరఖాస్తుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుందని ఏపీ సెట్‌ మెంబర్‌ సెక్రెటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఆక్టోబర్‌ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్‌ 20వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

జనరల్‌ అభ్యర్థులు రూ.1,200, బీసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 పరీక్ష ఫీజుగా చెల్లించాలన్నారు. మెత్తం 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం https://www.andhrauniversity.edu.in, https://apset.net.in వెబ్‌సైట్‌ నుంచి పొందవచ్చన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top