స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం | School bus missed a mortal danger | Sakshi
Sakshi News home page

స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Mar 14 2016 3:19 PM | Updated on Sep 3 2017 7:44 PM

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పచ్చికగూడ వద్ద సోమవారం మధ్యాహ్నం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.

శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పచ్చికగూడ వద్ద సోమవారం మధ్యాహ్నం తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. పాలకొండకు చెందిన డీఏవీ స్కూల్ బస్సును చెరకు లోడుతో వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన విద్యార్థులను సీతంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement