తిరుమలలో టెంకాయలు లేవు | Scarcity of coconuts in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో టెంకాయలు లేవు

Feb 7 2015 9:47 AM | Updated on Sep 2 2017 8:57 PM

తిరుమలలో టెంకాయలు లేవు

తిరుమలలో టెంకాయలు లేవు

తిరుమలలో కొబ్బరి కాయల కొరత ఏర్పడింది. కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

తిరుమల: తిరుమలలో కొబ్బరి కాయల కొరత ఏర్పడింది. కలియుగ దైవం శ్రీవేంటేశ్వరస్వామి వారిని దర్శించుకుని.. మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు దీంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. భక్తులు కర్పురం వెలిగించి... తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.

కొబ్బరికాయలు స్టాక్ లేవని కౌంటర్లు వద్ద టీటీడీ ఏర్పాటు చేసిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో భక్తులు తీవ్ర అసౌర్యానికి గురవుతున్నారు. మొక్కులు తీర్చుకునేందుకు ఎంతో దూరం నుంచి వచ్చామని... అయితే కొబ్బరికాయలు అందుబాటులో లేకపోవడంతో మొక్కులు సరిగ్గా తీర్చుకో లేకపోతున్నామని భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement