పొదుపుతోనే అభివృద్ధి


కడపసిటీ, న్యూస్‌లైన్: ప్రజలు పొదుపు చేయడం ద్వారానే అభివృద్ధి పథంలో పయనించగలరని సిండికేట్ బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎం.ప్రసాద్‌రావు తెలిపారు. నగర శివార్లలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శనివారం సిండికేట్ బ్యాంక్ 88వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించార  ఈ సందర్భంగా ప్రసాద్‌రావు మాట్లాడుతూ ప్రజలు పొదుపు చేస్తూనే తమవంతు రుణాలు కూడా పొందవచ్చన్నారు.  


 


స్విస్ట్ ఛెర్మైన్ రాజోలు వీరారెడ్డి మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సెక్యూరిటీ లేకున్నా రుణాలు అందించాలని కోరారు. మాజీ జెడ్పీ వైస్‌ఛెర్మైన్ లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రజలు విరివిగా రుణాలు పొందగలుగుతున్నారన్నారు. సిండికేట్ బ్యాంక్ ఏజీఎం నాగమల్లేశ్వరరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ వీరారెడ్డి, రవిశంకర్, రాంప్రసాద్‌లు మాట్లాడారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు, స్విస్ట్ విద్యార్థులు రక్తదానం చేశారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top