పల్లెల్లో సారా ఘాటు | Sarah pungent villages | Sakshi
Sakshi News home page

పల్లెల్లో సారా ఘాటు

Feb 13 2015 1:50 AM | Updated on Sep 5 2018 8:43 PM

పల్లెల్లో సారా ఘాటు - Sakshi

పల్లెల్లో సారా ఘాటు

మండలంలోని అనేక గ్రామాలు సారా కంపుకొడుతున్నాయి. నరసింహపురం, అయ్యవారికండ్రిగ, గంగమాంబ పురం,

పాలసముద్రం :  మండలంలోని అనేక గ్రామాలు సారా కంపుకొడుతున్నాయి. నరసింహపురం, అయ్యవారికండ్రిగ, గంగమాంబ పురం, కోద ండరామపురం గ్రామాల్లోని కొండల్లో స్థావరాలు ఏర్పా టు చేసుకుని సారా తయారు చేస్తున్నా రు. అక్కడ తయారైన సారాను పాలసముద్రం, కేజేపురం, తమిళనాడుకు సరఫరా చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో పదికి పైగా సారా బట్టీలు ఉన్న ఎక్సైజ్ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కొన్ని గ్రామాల్లో సారా ఉత్పత్తినే కుటీర పరిశ్రమగా చేసుకున్నారంటే పరి స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రాణాంతక రసాయనాలతో అధిక కిక్..

మత్తు ఎక్కువ ఉండాలని వ్యాపారులు సారాలో నవసాగ్రం, ప్లాస్టిక్ వస్తువులు, బ్యాటరీ సెల్స్, వివిధ ప్రాణాంతక రసాయనిక పదార్థాలు కలుపుతున్నారు. ఇది తాగితే ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. నాటుసారా తాగి గతంలో కొందరు మృతిచెందిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వేలాది కుటుంబాలు వీధుల పాలయ్యాయి. అధికారులకు నెల నెలా మామూళ్లు అందుతుండడంతో పట్టి ంచుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి.

రాత్రిపూట గుర్తు తెలియని వ్యక్తుల సంచారం.
 
మండలంలో సారా విక్రయాలు జోరుగా సాగుతుండడంతో గుర్తు తెలియని వ్యక్తులు సైతం ఇక్కడికొచ్చి సారా తాగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. రాత్రిపూట ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తుండడంతో మహిళలు, పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఎక్సైజ్ పోలీసులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement