
సాక్షి మెగా ఆటో షో విజయవంతం
రాజమహేంద్రవరంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఆటో షో విజయవంతమైంది.
బంపర్ డ్రా విజేతను ఎంపిక చేసిన ఎమ్మెల్యే ఆకుల
సాక్షి, రాజమహేంద్రవరం: కొనుగోలుదారులకు ఉపయుక్తంగా ఉండేలా ‘సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన మెగా ఆటో షో విజయవంతమైంది. రాజమహేంద్రవరంలో తొలిసారి నిర్వహించిన ఈ షోకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి ప్రజలు తరలివచ్చారు. 20 స్టాళ్లలో వివిధ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శనకు ఉంచారుు. అన్ని కంపెనీల వాహనాలు ఒకేచోట అందుబాటులో ఉండడంతో నచ్చిన వాహనాన్ని కొనుగోలుదారులు ఎంపిక చేసుకోవడం సులభంగా మారింది. పలువురు వాహనాలను కొనుగోలు చేయగా మరికొంతమంది అడ్వాన్ ్సలు చెల్లించి తమకు నచ్చిన వాహనాలను సొంతం చేసుకున్నారు. ప్రదర్శన సందర్భంగా పలు కంపెనీల డీలర్లు ప్రత్యేక ఆఫర్లు ఇచ్చారు.
విశాల మైదానంలో ప్రదర్శన, వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేయడం పట్ల డీలర్లు, సందర్శకులు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజులపాటు కొనుగోలు చేసిన వాహనదారులకు బంపర్ డ్రాలో సిరి మోటార్స్, ‘సాక్షి’ సౌజన్యంతో అందించే యమహా ఫ్యాసినో టూ వీలర్ విజేతను ఆదివారం రాత్రి నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఎంపిక చేశారు. విజేతగా నిలిచిన బొంతల ధనలక్ష్మికి ఫ్యాసినో వాహనాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఆకుల మాట్లాడుతూ.. ఇలాంటి ఆటో షోలు ఏర్పాటు చేయడం కొనుగోలుదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ‘సాక్షి’ మెగా ఆటో షో రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.