
నెల్లూరురూరల్/నెల్లూరు (వీఆర్సీసెంటర్): ‘సాక్షి’ ఆధ్వర్యంలో రెండో రోజూ ఆదివారం నిర్వహించిన ‘సాక్షి’ మెగా ఆటోషోకు అపూర్వ స్పందన లభిం చింది. నగరంలోని వీఆర్సీ క్రీడా మైదానంలో ‘సాక్షి’ మెగా ఆటోషో సరికొత్త ఆలోచనతో వివిధ రకాల టూ, ఫోర్ వీలర్ వాహనాలను ఒకే వేదికకు తీసుకువచ్చింది. ఆటో షోలో సరికొత్త మోడల్స్‌తో పాటు, అధునాతన ఫీచర్లు ఉన్న వాహనాలను పలు సంస్థలు తీసుకొచ్చి నగర ప్రజలకు, వాహన ప్రియులకు పరిచయం చేశాయి. నగర ప్రజలతో పాటుగా, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఔత్సాహికులతో వీఆర్సీ క్రీడా మైదానం నిండిపోయింది. నచ్చిన వాహనాలను టెస్ట్ డ్రైవ్ చేసుకునే వీలు కల్పించడంతో యువత పెద్ద సంఖ్యలో వచ్చి తమకు అనుకూల బడ్జెట్‌లో, అనుకున్న ఫీచర్లు కలిగి ఉన్న వాహనాల సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించుకుని సంతృప్తి చెంది, వాహనాలను కొనుగోలు చేశారు. మరికొంత మంది వాహనాలకు బుక్ చేసుకున్నారు. చివరి రోజు ఆటో షోకు పెద్ద సంఖ్యలో కుటుంబ సభ్యులతో వాహన ప్రియులు వచ్చి కొనుగోలు చేయటంతో ఆటోషోలో పాల్గొన్న కంపెనీలు సైతం ఆనందంలో మునిగిపోయాయి. ‘సాక్షి’ నిర్వహించిన ఆటోషోకు పలు కంపెనీలకు చెందిన 22 స్టాల్స్ ఏర్పాటు చేశారు. జిల్లాకు చెందిన కంపెనీలే కాక ఇతర జిల్లాలకు చెందిన కంపెనీలు ఆటోషోలో సరిత్త వాహనాలను నగర వాసులకు అందుబాటులో తీసుకు వచ్చారు. కొన్ని కంపెనీలు వారి వాహనాలకు స్పాట్ డెలివరీ, స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కల్పించటం గమనార్హం. ఇలాంటి ఆటోషోలను సక్సెస్ చేయటం ‘సాక్షి’కే సాధ్యమైందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
రెండో రోజూ అనూహ్య స్పందన
సాక్షి మెగా ఆటో షోకు అనూహ్య స్పందన లభించింది. ఆదివారం ముగిసిన షోలో అన్ని ప్రముఖ కంపెనీల వాహనాలను ఉంచడంతో వాహన ప్రియులు సందడి చేశారు. కొందరు తమకు నచ్చిన వాహనాలను కొనుగోలు చేశారు. షో సందర్భంగా షోరూం నిర్వాహకులు కొన్ని వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇచ్చారు. ఇటు వంటి షోలు ఏర్పాటు చేయడం వల్ల తమకు ఎంతో సమయం ఆదా అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. రెండో రోజు ఆదివారం ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు సాగింది. మొత్తంగా వేలాదిగా నగర ప్రజలు ప్రదర్శనలో పాల్గొని వారికి నచ్చిన వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు, బుక్ చేసుకున్నారు. సిరికళ వెడ్డింగ్ మాల్ సౌజన్యంతో ఆటో షో సందర్శకులకు గంట గంటకు లక్కీడిప్ తీసి గిప్ట్ కూపన్స్ అందజేశారు. ఈ ఆటో షోలో భార్గవి మారుతి సుజికి, భారతి నెక్సా, భార్గవి ఆటోమొబైల్, స్కోడా, కున్ హోండాయ్, సాయి షిర్డిషా హోండా, సరయు హీరో, ఎంఎల్ విస్సా, లక్ష్మీప్రసన్న హోండా, లక్ష్మీప్రియ టీవీఎస్, సుజికీ, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఎంఎస్ మోటార్స్ వీసా అప్రిలిక, హెల్త్ గూడ్స్, ఎక్స్‌ప్రెస్ హోండా, టాటా మోటార్స్, కేటీఎం, యమహా గోల్డ్ ఫీల్డ్, ఏఎంరెడ్డి హీరో, ఎంజీవీ బజాజ్, తదితర కంపెనీలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో సాక్షి డీజీఎం బి.రంగనా«థ్, నెల్లూరు యూనిట్ యాడ్స్ మేనేజర్, బ్రాంచ్ ఇన్‌చార్జి పి.కృష్ణప్రసాద్, బ్యూరో ఇన్‌చార్జి కె. కిషోర్, యాడ్స్ డిప్యూటీ మేనేజర్ జయరాజ్, భార్గవి ఆటో మొబైల్స్ అధినేత కొండా నిరంజన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు కర్తం ప్రతాప్‌రెడ్డి, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.