కొడవలూరు: తెలుగుతమ్ముళ్ల జేబుల్లోకి అప్పనంగా రూ.4 కోట్ల నిధులను పంపేందుకు రంగం సిద్ధమైంది. ఆయకట్టుదారుల పేరుతో కాలువల పూడికతీత పనులను తమ్ముళ్లకు కట్టబెట్టేందుకు అధికార పార్టీ నేతలు సన్నద్ధమయ్యారు. తొలుత కాలువల పూడికతీత బాధ్యతలను టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించాలని నిర్ణయించారు. నేతల ఒత్తిళ్లతో ఆయకట్టుదారులకే ఆ పనులు అప్పగించాలనే వాదాన్ని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తెరమీదకు తెచ్చారు.
సోమశిల జలాలను శనివారం విడుదల చేశారు. అయినా ఇప్పటి దాకా కాలువల పూడికతీత పనులు ప్రారంభం కాలేదు. ప్రధాన సాగునీటి కాలువల పూడికతీత పూర్తి స్థాయిలో జరగాలంటే కనీసం మూడు వారాల వ్యవధి అవసరమని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. పనుల బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయమై అధికార నేతలు తర్జనభర్జన పడడం వల్లే పూడిక తీతలో తీవ్రజాప్యం చోటుచేసుకుందన్న విమర్శలున్నాయి. ఐఏబీ సమావేశంలో ఈ నెల 25 నుంచి సోమశిల జలాలను విడుదల చేస్తామని ప్రకటించారు. 4,16,640 ఎకరాలకు సాగు నీరందించాలని నిర్ణయించారు.
ఆయకట్టుకు సాగునీరు సవ్యంగా అందాలంటే కాలువలు బాగుండాలి. అయితే ప్రధాన కాలువలన్నీ తూటాకు, జమ్ముతో నిండి ఉన్నాయి. వీటిని పూర్తి స్థాయిలో తొలగించని పక్షంలో చివరి ఆయకట్టుదారులకు సాగు నీరందవు. ఈ సమస్యను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడంతో తక్షణం కాలువల మరమ్మతులకు రూ.4 కోట్లు విడుదల చేసేందుకు ఆయన అంగీకరించారు.అయితే పూడికతీత పనులు ప్రారంభం కాకపోవడంతో రబీ సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కాలువల దుస్థితిని చూసి రైతులు నారు పోసుకునేందుకు వెనుకాడుతున్నారు.
తమ్ముళ్ల కోసమే.. : కాలువల పూడికతీతకు ముఖ్యమంత్రి రూ.4 కోట్ల నిధులు ఇచ్చారని,వెంటనే టెండర్లు పిలిచి పనులు చేపడుతామని జన్మభూమి సభల్లో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెబుతూ వచ్చారు. నియోజకవర్గం డెల్టా ప్రాంతం కావడంతో రైతులు కూడా ఆనందించారు. అయితే జన్మభూమి చివరి రోజుల్లో కాలువల పూడికతీతపై రైతులు ఎమ్మెల్యేను ప్రశ్నించారు. కాలువల కింద ఆయకట్టున్న రైతులకే పూడికతీత పనులు అప్పగించేలా అధికారులను ఒప్పించామని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు.
నీటి విడుదల ప్రారంభమైనా హామీలే తప్ప పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. నీటి విడుదల జరిగాక పూడికతీత పనుల్లో నాణ్యత పాటించే అవకాశాలు లేవనే వాదన ఉంది. ఇప్పటికే పూడికతీత పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆయకట్టు రైతులకే పూడికతీత పనులు అప్పగిస్తే వారు బాధ్యతతో వ్యవహరించే అవకాశం ఉంది. ఇక్కడ అధికార పెద్దల ఆలోచన మరోలా ఉందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. తెలుగు తమ్ముళ్లకు పూడిక పనులు అప్పగించి వారు నాలుగు రూకలసంపాదించుకునేందుకే అధికారులపై ఒత్తిడి తెచ్చి టెండర్లు లేకుండా చేశారనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదీ ఆయకట్టు: సోమశిల జలాశయం నుంచి అధికారికంగా 4,16,640 ఎకరాలకు అందాల్సి ఉంది. ఇందులో పెన్నా డెల్టా కింద 2.47 లక్షల ఎకరాలుంది. కనుపూరు కాలువ కింద 33 వేల ఎకరాలు, కావలి కాలువ కింద 72,489 ఎకరాలు, ఉత్తర కాలువ కింద 34,257 ఎకరాలు, దక్షిణ కాలువ కింద 29,894 ఎకరాల ఆయకట్టు ఉంది. పెన్నా డెల్టా పరిధిలోని ఆయకట్టుకు సంగం డెల్టా కింద ఏటీఎస్ కాలువ ద్వారా 26,826 ఎకరాలకు, దక్షిణ కాలువ ద్వారా 25 వేలు, తూర్పు కాలువ ద్వారా 25,491 ఎకరాలకు సాగు నీరందుతుంది. నెల్లూరు డెల్టా కింద జాఫర్ సాహె బ్ కాలువ ద్వారా 33 వేల ఎకరాలు, సర్వేపల్లి కాలువ ద్వారా 30 వేలు, నెల్లూరు చెరువు ద్వారా 12 వేలు, సర్వేపల్లి రిజర్వాయర్ ద్వారా 14 వేల ఎకరాలకు నీరందాల్సి ఉంది.
తమ్ముళ్ల జేబులు నింపేందుకే రూ.4 కోట్ల పనులు
Published Sun, Oct 26 2014 2:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement