డ్రైవర్ల అప్రమత్తతతోనే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధురి పేర్కొన్నారు.
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్: డ్రైవర్ల అప్రమత్తతతోనే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హా జరై వారోత్సవాల ప్రారంభ సభలో ప్రసంగిం చారు. ప్రమాదాలు నివారించడం అందరి బా ధ్యత అని వివరించారు.
పూర్తిస్థాయిలో ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించా రు. ప్రమాదాలు జరగడానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే కారణమని, వాహనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి నడపాలని వివరించారు. 25వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆర్టీసీ డీఎం శివకేశవ్‌యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ జాకుబ్, ఎంఎఫ్ ఎస్.వి.రావు, నాయకులు పాల్గొన్నారు.
నామమాత్రంగా వారోత్సవాలు
ఆర్టీసీలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. ఏమాత్రం ప్రచారం లేకుండా ఆదిలాబాద్ డిపో మేనేజర్ ఏకంగా వారోత్సవాలు ప్రారంభించడంతో ఆర్టీసీ కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రైవర్లు, కండక్టర్లకు వీటిపై ఎలాంటి అవగాహన కల్పించలేదు. గేట్ మీటింగ్‌లు పెట్టి ప్రమాదాలు నివారించే కార్యక్రమాలు నిత్యం చేయాల్సి ఉంటుంది. కానీ వారోత్సవాల మొదటి రోజు కూడా కార్మికులకు, కార్మిక సంఘ నాయకులు ఏమాత్రం సమాచారం అందించలేదు. దీనిపై డిపో మేనేజర్‌ను వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు.
ప్రతీ ఒక్కరి బాధ్యత - ఆర్టీవో గౌరీశంకర్
వేంపల్లి(మంచిర్యాల రూరల్) : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంచిర్యాల ఆర్టీవో గౌరీశంకర్ కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాలను ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ఆర్టీవో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే మనసు మాటలపై ఉంటుందని, దీంతో ఎదురుగా వచ్చే వాహనాలపై దృష్టి ఉండదని, ఇలా 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు.
మద్యం సేవిస్తే వాహనం నడపవద్దని, అతివేగం, అజాగ్రతలతో మనతో పాటు, ఎదురుగా వస్తున్న వాహనాలకు ప్రమాదమేనని గుర్తించాలని పేర్కొన్నారు. వాహనం తీసుకుని వెళ్లిన వారు, తమ కుటుంబం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే, సగానికి పైగా ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు.
మానసిక ఆందోళన, కోపం, ఆవేశం ఉన్నప్పుడు వాహనం నడపడం మానుకుంటే మంచిదని సూచించారు. 2013 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 1200ల ప్రమాదాలు జరిగితే 1,554 మంది మృతిచెందారని, 2,134 మంది గాయాలతో క్షతగాత్రులుగా మారారని, ఈ ఏడాది ప్రమాదాలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను, సీడీలను ఆర్టీవో ఆవిష్కరించారు. మంచిర్యాల రూరల్ సీఐ కరుణాకర్, పట్టణ సీఐ రవీంద్రారెడ్డి, ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజర్ మనూల్లయ్య, ఏవో లక్ష్మీనారాయణ, ఎంవీఐలు ఉమామహేశ్వర్‌రావు, శ్యాంనాయక్, ఏంవీఐ సిరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.