అలాంటి యువతకు మహాకవి శ్రీశ్రీ ఏమని సందేశమిచ్చారంటే.. ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం,, మరో ప్రపంచం పిలిచింది.
యువత అంటే.. ‘అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు.. తరతరాల నిశీధి దాటే చిరు వేకువజాడ.. ఎవరని ఎదురే నిలిస్తే.. తెలిసే బదులు.. పెను తుపాను తలొంచి చూసే తొలి నిప్పుకణం.. కాలం తరిమిందో.. శూలంలా ఎదిరిస్తుంది.. సాయం సరదా పడితే.. సమరమై గెలుస్తుంది.. ఫెళఫెళ ఉరుమై ఉరుముతూ.. జిగి ధగధగ మెరుపై వెలుగుతూ.. పెను నిప్పై నివురును చీల్చేస్తుంది...’ అన్నారు ఓ గేయ రచయిత.
అలాంటి యువతకు మహాకవి శ్రీశ్రీ ఏమని సందేశమిచ్చారంటే.. ‘మరో ప్రపంచం.. మరో ప్రపంచం,, మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు.. పదండి తోసుకు.. పదండి పోదాం పైపైకి... కదం తొక్కుతూ.. పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ... ఎముకలు కుళ్లిన.. వయసు మళ్లిన.. సోమరులారా చావండి. నెత్తురు మండే.. శక్తులు నిండే సైనికులారా రారండి... బాటలు నడచీ.. పేటలు కడచీ.. కోటలన్నిటిని దాటండి... ప్రభంజనంలా హోరెత్తండి.. భావ వేగమున ప్రసరించండి... త్రాచుల వలెనూ.. రేచులవలెనూ ధనుంజయునిలా సాగండి...’ అంటూ మహాకవి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొచ్చారు. రాష్ట్ర విభజన.. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న కుమ్మక్కు రాజకీయూల వల్ల ఘనచరిత్ర తమదని చెప్పుకుంటున్న రాజకీయ పార్టీలు ప్రజావిశ్వాసం కోల్పోయూరు.
చేష్టలుడిగి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఒక యంగ్ డైనమిక్ లీడర్ అవసరమని యువత భావిస్తోంది. జిల్లా ఓటర్లలో 54 శాతంగా ఉన్న యువతపైనే రాజకీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉంది.
రాజకీయూలను శాసించే స్థారుకి ఎదిగిన యువ ఓటర్లు ఏమనుకుంటున్నారు.. ఏం కోరుకుంటున్నారు.. ఎలాంటి నాయకుడు కావాలనుకుంటున్నారు.. పథకాలు ఎలా ఉండాలని భావిస్తున్నారు.. గత ప్రభుత్వాల పనితీరుపై వారేమనుకుంటున్నారనే అంశాలపై ‘సాక్షి' బృందం యువతను కదిలించింది.