రేషన్‌షాపులు పరిశీలించిన జేసీ | Resansapulu, JC examining | Sakshi
Sakshi News home page

రేషన్‌షాపులు పరిశీలించిన జేసీ

Feb 3 2016 1:06 AM | Updated on Mar 21 2019 8:29 PM

రేషన్‌షాపులు పరిశీలించిన జేసీ - Sakshi

రేషన్‌షాపులు పరిశీలించిన జేసీ

జిల్లాలోని రేషన్ షాపులను జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్ మంగళవారం పరిశీలించి తనిఖీ చేశారు.

  సాక్షి కథనానికి స్పందన
 విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలోని రేషన్ షాపులను జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్ మంగళవారం పరిశీలించి తనిఖీ చేశారు. సాక్షి దినపత్రికలో ‘తొలి రోజే తంటాలు’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన జిల్లా కేంద్రం, గంట్యాడ మండలం రామవరంలో ఆయన రేషన్‌షాపుల్లో ఈ పాస్ పనితీరును పరిశీలించారు.

ఈ సందర్బంగా డీలర్లతో మాట్లాడుతూ ఈ పాస్‌లో లోపాలుంటే వెంటనే సమాచారాన్ని ఇవ్వాలన్నారు. ఈపాస్ యంత్రాలు, ఈవెయింగ్ మెషీన్లు పనిచేయనపుడు తక్షణమే మరమ్మతు పనులు చేయించుకోవాలన్నారు. ఆయన వెంటన డీఎస్‌ఓ పి.నాగేశ్వరరావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement