మళ్లీ బరితెగింపు | red sander wood smuggling in YSR district | Sakshi
Sakshi News home page

మళ్లీ బరితెగింపు

Feb 2 2014 2:20 AM | Updated on Sep 2 2017 3:15 AM

రైల్వేకోడూరు మండలం బాలుపల్లె అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులపై రాళ్లు రువ్వారు.

రైల్వేకోడూరు రూరల్, న్యూస్‌లైన్: రైల్వేకోడూరు మండలం  బాలుపల్లె అటవీ ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీ పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు గాలిలో కాల్పులు జరపగా స్మగ్లర్లు పారిపోయినట్లు సమాచారం.

 

అయితే పారిపోతున్న వారిలో కొందరిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై సీఐ రమాకాంత్ మాట్లాడుతూ సంఘటన జరిగిన విషయం వాస్తవమేనన్నారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఎస్పీతో మాట్లాడి పూర్తి వివరాలు ఆదివారం వెల్లడిస్తామన్నారు.  కూంబింగ్ నిర్వహిస్తుండగా గుంజనే రు సమీపంలో ఈ ఘటన  చోటు చేసుకుందన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement