
విజయవాడ సిటీ: జిల్లావ్యాప్తంగా రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం కొనసాగుతుంది. పార్టీనేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి నవరత్నాల పథకాలను వివరిస్తున్నారు. పార్టీ శ్రేణులు ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టబోయే ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు గురించి విçస్తృత ప్ర చారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి మంచి చేయాలి. ప్రతి రైతన్నకు తోడుగా నిలబడాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న జగనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా తాము నిలబడతామని, «చంద్రబాబు చేసే కుయుక్తులకు లొంగబోమని ప్రజ లు స్పష్టం చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు తమ జీవితాల్లో వెలుగు నింపుతుందనే విశ్వాసాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
శనివారం జిల్లాలో జరిగిన రావాలి జగన్...కావాలి జగన్ కార్యక్రమం విశేషాలు...
పెనమలూరు నియోజక వర్గంలో కంకిపాడు మండలం గొల్గగూడెంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ జిల్లా అ«ధ్యక్షుడు కొలుసు పార్థసారథి నేతృత్వంంలో జరిగింది. ఇంటింటికి వెళ్లి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల చంద్రశేఖర్ (బుడ్డి), బీసీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కాశ్రీనివాసరావు, జిల్లా అధికార ప్రతి నిధి బండి నాంచారయ్య, కిలారు శ్రీనివాసరావు, పార్టీ మండల అ«ధ్యక్షుడు మద్దాలి రామచంద్రరావు, నాయకులు పాల్గొన్నారు.
కైకలూరు నియోజవర్గంలో కైకలూరు మండలం, గోపవరం గ్రామంలో పార్టీ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం జరి గింది. రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నోబుల్, పార్టీ మండల అధ్యక్షుడు ముం గర నరసింహరావు, ఎంపీటీసీ సభ్యురాలు అడుసుమిల్లి రమాదేవి, నాయకులు పాల్గొన్నారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో పులిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని పాతకోటలో పార్టీ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు నేతృత్వంలో రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఆయన ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధికార ప్రతిని«ధి సింహాద్రి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్ రేపల్లె శ్రీనివాసరావు, మండల మహిళా కన్వీనర్ బీసాబత్తిన విజయలక్ష్మి, చింతలపూడి బాలు పాల్గొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త మల్లాది విష్ణు నేతృత్వంలో స్థానిక 5వ డివిజన్ మాచవరం దాసాంజనేయస్వామివారి దేవాలయం వద్ద రావాలి జగన్ – కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికి తిరిగి ప్రజ లకు వివరించారు. కార్యక్రమంలో డివిజన్ కో– ఆర్డినేటర్ కోలా నాగాంజనేయులు, కాళిదాసు, బాడిత అప్పారావు, పసుపులేటి కోటేశ్వరరావు, సీహెచ్ అంతయ్య, డివిజన్ మైనార్టీ అధ్యక్షులు ఎండీ రఫీ, సెక్రటరీ మౌలాలీ, రాజేష్, బొల్లిగర్ల శంకర్‌యాదవ్, రుద్దండి సురేష్, బంకా భాస్కర్, సురేష్ బాబు, మానం వెంకటేశ్వరరావు, ఎండీ అఫ్రోజ్, కంభం కొండలరావు పాల్గొన్నారు.
మచిలీపట్నం నియోజవకవర్గంలో నవీన్ మిట్టల్ కాలనీలో పార్టీ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య ’(నాని) నేతృత్వంలో రావాలి జగ న్ – కావాలి జగన్ కార్యక్రమం జరిగింది. ఇం టింటికి తిరిగి నవరత్నాలను ప్రజలకు వివరిం చారు. పార్టీ నేతలు సిలార్ దాదా, మేకా శ్రీనివాసరావు పాల్గొన్నారు.