
రామగుండం.. అగ్నిగుండమైంది
రాష్ట్రంలో ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి
- నిజామాబాద్‌లో 44.2, హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు ఇంకా మండుతూనే ఉన్నాయి. రెండ్రోజులు తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా మంగళవారం మరింత పెరిగాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ వేసిన అంచనా ప్రకారం రామగుండంలో అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 44.2, వరంగల్‌లో 44, హైదరాబాద్‌లో 43, అశ్వారావుపేటలో 43.4, జగిత్యాలలో 42.3, కంపాసాగర్‌లో 43.8, రుద్రూర్‌లో 42, సంగారెడ్డిలో 42, తాండూరులో 42.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.