
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విశాఖపట్నం : విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాగల 24 గంటల్లో కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేశారు.