టీసీ అసభ్య ప్రవర్తన | railway ticket collector Indecent behavior | Sakshi
Sakshi News home page

టీసీ అసభ్య ప్రవర్తన

Feb 16 2015 11:22 AM | Updated on Sep 2 2017 9:26 PM

చెన్నై - హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలి పట్ల టికెట్ కలెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒంగోలు రైల్వే స్టేషన్ లో కేసు నమోదైంది.

ఒంగోలు: చెన్నై - హైదరాబాద్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికురాలి పట్ల టికెట్ కలెక్టర్ అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒంగోలు రైల్వే స్టేషన్ లో సోమవారం ఉదయం  కేసు నమోదైంది. చెన్నై నుంచి హైదరాబాద్ వెళ్లున్న ఎక్స్ ప్రెస్లో టీసీ గంగయ్య తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఒంగోలు జిల్లాకు చెందిన ఓ మహిళ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమాచారం తెలుసుకున్న టీసీ పరారయ్యాడు. ఈ మేరకు ఒంగోలు పట్టణంలోని  రైల్వే పోలీసులు టీసీ గంగయ్యను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement