 
															చేవెళ్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఆర్. కృష్ణయ్య?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం.
	సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పోటీ చేయనున్నట్లు సమాచారం.  శుక్రవారం సాయంత్రం కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.  నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి నేతృత్వంలో శుక్రవారం రాత్రి వచ్చిన యువతను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తాను కృష్ణయ్యను ఎపుడో పార్టీలోకి ఆహ్వానించానని చెప్పారు.
	
	వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు వంద సీట్లు కేటాయిస్తామని, తెలంగాణకు బీసీని సీఎం చేస్తానని చెప్పారు. ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసిన శిబు సోరెన్‌కు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. కృష్ణయ్య మాట్లాడుతూ... బీసీలు దండు కడి తే అన్ని పార్టీలు దారికి వస్తాయన్నారు.
	
	టీడీపీతో కలిసి పనిచేసే విషయమై తమ సంఘం రాష్ట్ర కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బీసీలను సీఎం చేస్తామని ప్రకటించిన టీడీపీపై ఎవ్వరూ విమర్శలు చేసినా సహించే ది లేదన్నారు.  మాజీ ఆర్థిక శాఖా మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం చంద్రబాబును కలిసి తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను అందచేశారు. మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు టీడీపీ నేతలు నివాళులర్పించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
