పవిత్ర కృష్ణా, గోదావరి పుష్కరాలను తన ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని
రాష్ట్ర సర్కారుపై పీఠాధిపతులు, స్వామీజీల మండిపాటు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పవిత్ర కృష్ణా, గోదావరి పుష్కరాలను తన ప్రచారానికి వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం రూ.4 వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు, సేవా సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కరాలప్పుడు కూల్చిన 46 ఆలయా లను ప్రభుత్వ ధనంతో పునర్నిర్మిం చాలని, లేకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ రామా ఫంక్షన్ హాలులో ‘హిందూ ధర్మం – సవాళ్లు – భవిష్యత్’ అనే అంశంపై ఆదివారం సదస్సు జరిగింది. విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు శివస్వామి, హరిహర పీఠాధిపతి హరేశ్వరానంద, రామానుజ సిద్ధాంత ప్రచార సంఘం కార్యదర్శి డీఎస్‌ఎన్‌వీ ప్రసాదబాబు, గాయకుడు గజల్ శ్రీనివాస్, కనకదుర్గ ధర్మ ప్రచార పరిషత్ డైరెక్టర్ రాజగోపాల చక్రవర్తి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.