మంత్రుల మధ్య ప్రొటోకాల్‌ రగడ

Protocol controversy between the ministers

శ్రీకాకుళం : జిల్లాలో సోమవారం ఉదయం అంబేడ్కర్‌ ఆడిటోరియంలో జరగనున్న ‘ప్రధానమంత్రి – చంద్రన్న బీమా’ పథకానికి సంబంధించి ముద్రించిన ఆహ్వాన పత్రంలో ప్రొటోకాల్‌ సమస్య తలెత్తింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్‌చార్జి పితాని సత్యనారాయణ, ఇంధన శాఖ మంత్రి కళా వెంకటరావు, రవాణాశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరవుతారని అధికారులు ఆహ్వాన పత్రాన్ని ముద్రించి పంపిణీ చేశారు. అయితే ప్రస్తుత మంత్రివర్గంలో సీనియర్‌ మంత్రి అచ్చెన్నాయుడు అ యినప్పుడు కళా వెంకటరావు పేరు తర్వాత ఆయన పేరును ముద్రించడాన్ని తెలుగుదేశం కార్యకర్తలు, మంత్రి అనుయాయులు తప్పుబడుతున్నారు. ఇన్‌చార్జి మంత్రి జి ల్లాకు వచ్చి ఉంటే అంతగా సమస్య తలెత్తేది కాదు. ఆయనే కార్యక్రమాన్ని నడిపించేవా రు. అయితే ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభమవుతుండడంతో పితాని ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో అటు తర్వాత పేరును ముద్రిం చిన కళా వెంకటరావు కార్యక్రమాన్ని నడిపించాల్సి ఉండగా ఆదివారం రాత్రి వరకు మంత్రి కళా పర్యటనకు సంబంధించి ఎ లాంటి సమాచారం జిల్లా అధికారులకు గా నీ, పౌరసంబంధాల అధికారులకు గానీ అందలేదు.

దీంతో ఆయన సైతం కార్యక్రమంలో పాల్గొనరని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారా, లేదా అన్నది సందేహంగానే ఉంది. పలువురు కార్యకర్తలు, మంత్రి అనుయాయులు ప్రోటోకాల్‌ను పాటించని కార్యక్రమంలో పాల్గొనవద్దని అచ్చెన్నపై ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఆయన అధికారులపై గుర్రుగానే ఉన్నట్లు భోగట్టా. సోమవారం ఉదయం 10 గంటలకు  నరసన్నపేటలో జరిగే ఓ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొంటున్నట్లు పౌరసంబంధాల అధికారులకు సమాచారం వచ్చింది. ఈ లెక్కన ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు తక్కువేనని కొందరు అంటుండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొంటారని, అయితే అధికారుల తప్పిదాన్ని ప్రశ్నిస్తారని, ఇకముందు ఇలా జరి గితే రాష్ట్ర స్థాయిలో ప్రొటోకాల్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

రాష్ట్రస్థాయి నుంచి ప్రోటోకాల్‌కు సంబంధించి విడుదలైన ఉత్తర్వుల్లో కేబినెట్‌ మంత్రి ప్రోటోకాల్‌ మంత్రిగా ఉంటారని పేర్కొన్నారే తప్ప ఏ ఒక్కరి పే రునూ సూచించలేదని నిర్వాహక అధికారులు చెబుతున్నారు. ఇద్దరూ కేబినెట్‌ మంత్రులు కావడంతో ఇలా ముద్రించామని వారంటున్నారు. అయితే ఈ ప్రోటోకాల్‌ వివాదం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top