సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు | problems of geeta workers in prakasam district | Sakshi
Sakshi News home page

సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు

Jun 14 2015 8:39 AM | Updated on Sep 3 2017 3:45 AM

సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు

సర్కస్ ఫీట్లు కాదు..బతుకు పాట్లు

నాలుగు రూపాయలు సంపాదించాలంటే సాహసం చేయాలి.

కొనకనమిట్ల (ప్రకాశం) : నాలుగు రూపాయలు సంపాదించాలంటే సాహసం చేయాలి. యాభై అడుగుల ఎత్తున్న తాటిచెట్లు ఎక్కి తాటాకు కొట్టాలంటే అంతకు మించి ధైర్యం ఉండాలి. కొనకనమిట్ల మండలంలో ఎక్కువగా తాటాకు వ్యాపారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కూలీల చేత తాటాకు కొట్టిచ్చి దానిని గుంటూరు, విజయవాడ లాంటి నగరాలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో చినమనగుండం, లింగంగుంట గ్రామాలకు చెందిన వెంకటేశ్వర్లు, బాలయ్యలు ఎంతో ధైర్యంగా చెట్లు ఎక్కి తాటాకు కొడుతున్నారు.

ఇక్కడ విశేషమేంటంటే చెట్టు దిగకుండా కర్ర సాయంతో పాకుకుంటూ మరో చెట్టుకు చేరి ఆకు దించుతారు. పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేయక తప్పదని వెంకటేశ్వర్లు, బాలయ్యలు అంటున్నారు.                                          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement