పుష్కర ఘాట్ లో పురోహితుడి నిజాయితీ | priest shows his honesty at rajamandry | Sakshi
Sakshi News home page

పుష్కర ఘాట్ లో పురోహితుడి నిజాయితీ

Jul 17 2015 10:45 AM | Updated on Aug 1 2018 5:04 PM

స్థానిక వీఐపీ ఘాట్‌లో తనకు దొరికిన పర్సును రాజమండ్రి మార్కండేయస్వామి ఆలయ పూజారి కంట్రోల్ రూమ్‌లో ఉన్న పోలీసులకు అప్పగించాడు.

వీఐపీఘాట్ (రాజమండ్రి) : స్థానిక వీఐపీ ఘాట్‌లో తనకు దొరికిన పర్సును రాజమండ్రి మార్కండేయస్వామి ఆలయ పూజారి కంట్రోల్ రూమ్‌లో ఉన్న పోలీసులకు అప్పగించాడు. అంతవరకు తమ వస్తువులు పోయాయి అంటూ ఫిర్యాదు చేసే వారినే చూసిన పోలీసులు అతడి నిజాయితీని మెచ్చుకున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మన వద్ద ఉన్న సొమ్ములను దొంగలు తస్కరిస్తే పరిస్థితి ఎలావుంటుందో తనను అనుభవం ఉందంటూ కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వెళ్లిన సమయంలో బ్యాగ్‌ని పోగొట్టుకుని తిరిగి వచ్చేందుకు సొమ్ములు లేక, ఇతరులను అడగలేక పడిన ఇబ్బందులను వివరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement