పీఎంపీ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి | pregnant died due to clinic negligence | Sakshi
Sakshi News home page

పీఎంపీ నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతి

Feb 19 2014 5:29 AM | Updated on Sep 2 2017 3:52 AM

పీఎంపీ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సం ఘటన పలమనేరులో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని టీ.వడ్డూరుకు చెందిన హేమంత్ భార్య శివకుమారి (22)కి నొప్పులు రావడంతో కుటుం బీకులు సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనివాసా క్లినిక్‌కు తీసుకొచ్చారు.

 క్లినిక్‌పై కుటుంబీకుల దాడి
 పలమనేరులో ఘటన
 రాజీ కోసం రంగంలోకి పీఎంపీ అసోసియేషన్
 పలమనేరు, న్యూస్‌లైన్:
 పీఎంపీ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు గర్భిణి మృతి చెందింది. ఈ సం ఘటన పలమనేరులో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. మండలంలోని టీ.వడ్డూరుకు చెందిన హేమంత్ భార్య శివకుమారి (22)కి  నొప్పులు రావడంతో కుటుం బీకులు సోమవారం సాయంత్రం పట్టణంలోని శ్రీనివాసా క్లినిక్‌కు తీసుకొచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న పీఎంపీ పార్వతి పరీక్షించి తాను డెలివరీ చేస్తానని ఒప్పుకున్నారు. గర్భిణి కుటుంబీ కుల నుంచి అడ్వాన్స్‌గా రూ.7 వేలు తీసుకున్నారు. శివకుమారికి నొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం కావడానికి అవసరమైన ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే శివకుమారికి తొలి కాన్పు సిజేరియన్ అయింది. ఇవేమీ పట్టించుకోని పీఎంపీ తన క్లినిక్‌లోనే అబ్జర్వేషన్‌లో ఉంచుకున్నారు. అయితే మంగళవారం వేకువజామున గర్భిణి మృతి చెందింది. చేసే ప్రయత్నమంతా చేశానని, పరిస్థితి విషమంగా ఉందంటూ పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబీకులతో చెప్పా రు. అప్పటిదాకా చేసిన వైద్యం కోసం మరో రూ.10 వేలు తీసుకున్నారు.
 
 శివకుమారి పరిస్థితి విషమంగానే ఉందని భావించిన కుటుంబీకులు క్లీనిక్‌లోకి వెళ్లి చూడగా అప్పటికే ఆమె మృతి చెంది నట్టు తెలుసుకున్నారు. డబ్బుకోసమే నాటకం ఆడినట్టు గుర్తించిన కుటుంబీ కులు క్లినిక్‌పై దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రిలోని ఫర్నిచర్, వస్తువులను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. క్లినిక్ ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలియడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిజెప్పారు. పీఎంపీ పార్వతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. శివకుమారి మృతితో టీ.వడ్డూరులో విషాదఛాయ లు అలుముకున్నాయి. మృతురాలికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
 
 రంగంలోకి దిగిన
 పీఎంపీ అసోసియేషన్
 ఈ వ్యవహారంపై పోలీసు కేసు లేకుండా సెటిల్‌మెంట్ చేసుకోవడానికి స్థానిక పీఎంపీ అసోసియేషన్ రంగంలోకి దిగింది. మధ్యవర్తుల ద్వారా బాధితుల కుటుంబీకులతో సంప్రదింపులు జరిపారు. రూ.లక్ష పరిహారంగా చెల్లిస్తామంటూ మృతురాలి ప్రాణానికి వెలకట్టారు. ఈ వ్యవహారమంతా పోలీస్‌స్టే షన్ ఎదుటే జరగడం గమనార్హం.
 
 నిబంధనలకు నీళ్లు
 పట్టణంలోని పలువురు పీఎంపీ, ఆర్‌ఎంపీలు వచ్చీరాని వైద్యంతో రోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వీరు ప్రథమ చికిత్సలు చేయడానికి మాత్రమే అర్హులైనప్పటికీ తీరు మా త్రం సర్జన్లకు మించిపోతోంది. ధనార్జనే ధ్యేయంగా అన్ని చికిత్సలూ అందిస్తు న్నా వైద్యశాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement