ప్రకాశం బ్యారేజి వద్ద బుధవారం నాటికి కృష్ణా నదిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. బ్యారేజి వద్ద ఎల్లప్పుడూ 12 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఇబ్రహీంపట్నం ధర్మల్ విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పాదన వీలు ఉంటుంది.
తాడేపల్లి రూరల్: ప్రకాశం బ్యారేజి వద్ద బుధవారం నాటికి కృష్ణా నదిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. బ్యారేజి వద్ద ఎల్లప్పుడూ 12 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఇబ్రహీంపట్నం ధర్మల్ విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పాదన వీలు ఉంటుంది.
ఉదయం బ్యారేజి వద్ద 9.2 అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. సాయంత్రానికి పులిచింతల నుంచి 15,600 క్యూసెక్కుల నీరు బ్యారేజి వద్దకు వచ్చి చేరడంతో నీటిమట్టం 9.8 అడుగులకు చేరుకుంది. దీని నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు 2000, తూర్పు డెల్టాకు 3000, గుంటూరు చానల్‌కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే కృష్ణానదిలో నీటిమట్టం తగ్గడం తెలియకపోవడంతో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీతానగరం పుష్కరఘాట్‌ల వద్ద మోకాళ్ల లోతులోనే కృష్ణానదిలో నీరు ఉండడంతో చేసేదేమీలేక వినాయక విగ్రహాలను అక్కడే నిమజ్జనం చేసి భక్తులు తిరుగుముఖం పడుతున్నారు.