ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన బస్సు డ్రైవర్ అరెస్ట్! | Prakash Raj accident Case: Bus driver arrest | Sakshi
Sakshi News home page

ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన బస్సు డ్రైవర్ అరెస్ట్!

Aug 13 2014 10:09 PM | Updated on Sep 2 2017 11:50 AM

ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన బస్సు డ్రైవర్ అరెస్ట్!

ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన బస్సు డ్రైవర్ అరెస్ట్!

సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన కేసులో బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని బుధవారం అరెస్ట్ చేశామని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ కే. నర్సింహులు తెలిపారు.

హైదరాబాద్: సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కారును ఢికొట్టిన కేసులో బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని బుధవారం అరెస్ట్ చేశామని మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ కే. నర్సింహులు తెలిపారు. నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసును విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ మల్లారెడ్డిని విచారించినట్టు ఆయన తెలిపారు. 
 
మంగళవారం రాత్రి హైటెక్ సిటీ సమీపంలోని మాదాపూర్ ఫ్లైఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రకాశ్ రాజ్ కు స్వల్ప గాయాలు కాగా, కారు పాక్షికంగా ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబానికి కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనలో అక్షర అనే చిన్నారి గాయపడింది. 

Advertisement
 
Advertisement
Advertisement