నేటి నుంచి పీవోడ బ్ల్యూ రాష్ట్ర 6వ మహాసభలు | pow state meetings | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పీవోడ బ్ల్యూ రాష్ట్ర 6వ మహాసభలు

Mar 1 2014 1:01 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర 6వ మహాసభలు శనివారం నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) రాష్ట్ర 6వ మహాసభలు శనివారం నుంచి హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు జరగనున్నాయి. శనివారం ఉదయం 11 గంట లకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య పార్కు నుంచి ఇందిరాపార్కు ధర్నా చౌక్ వరకూ 10 వేల మంది మహిళలతో భారీ ప్రదర్శన జరుగుతుంది. అనంతరం జరిగే బహిరంగ సభలో మాజీ ప్రొఫెసర్ రమా మెల్కోటే, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కేంద్ర నాయకురాలు టాన్యా, విప్లవ ప్రజా రచయిత విమల, పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్ ప్రసంగిస్తారు. 2న కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ప్రారంభోపన్యాసం, అనంతరం విద్యా గోష్ఠి ఉంటుంది. 3న ప్రతినిధుల మహాసభ జరుగనుంది.  
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement