మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులంటూ విశాఖపట్టణం జిల్లా కొయ్యూరులో కరపత్రాలు వెలిశాయి.
కొయ్యూరు: మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులంటూ విశాఖపట్టణం జిల్లా కొయ్యూరులో కరపత్రాలు వెలిశాయి. కొయ్యూరు మండల కేంద్రం రాజేంద్రపాలెంలో ఆదివారం రాత్రి కరపత్రాలు దర్శనమిచ్చాయి. మావోయిస్టుల అలజడి కారణంగా దండకారణ్యంలోని గిరిజనులు, ఆదివాసీల మనుగడ ప్రశ్నార్ధకంలో పడిందని అందులో ఆరోపించారు. పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే అనుమానంతో అమాయక గిరిజనులను చంపేస్తున్నారని పేర్కొన్నారు. మావోయిస్టుల కారణంగా ఏజన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందని పేర్కొన్నారు.