తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు | Post offices srivari View Tickets | Sakshi
Sakshi News home page

తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు

Dec 1 2014 7:44 AM | Updated on Sep 2 2017 5:24 PM

తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు

తపాలా కార్యాలయాల్లో శ్రీవారి దర్శన టికెట్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం

తిరుపతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో తిరుమల శ్రీవారి ద ర్శనానికి రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లను సోమవారం నుంచి విక్రయించనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 5 జిల్లాల్లో 9 తపాలా కార్యాలయాల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.

చిత్తూరు జిల్లా మదనపల్లె తపాలా కార్యాలయం, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసులో సోమవారం నుంచి ఈ టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తారు. విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో కూడా ఆన్‌లైన్ బుకింగ్ సోమవారం ప్రారంభం కానుంది.

టికెట్లను ఉదయం 10 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు జారీ చేస్తారని తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ టీఏవీ.శర్మ తెలిపారు. స్లాట్‌లో 500 టికెట్లు జారీ చేస్తామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement