నిరుపేదకు పెద్ద జబ్బు | Poor people two kidneys fail | Sakshi
Sakshi News home page

నిరుపేదకు పెద్ద జబ్బు

Jun 18 2017 9:15 AM | Updated on Aug 25 2018 5:41 PM

నిరుపేదకు పెద్ద జబ్బు - Sakshi

నిరుపేదకు పెద్ద జబ్బు

రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది.

► రెండు కిడ్నీలు ఫెయిల్‌
► ఆపరేషన్‌కు రూ.4లక్షలు అవుతుందన్న వైద్యులు
► భర్తను కాపాడాలని భార్య వేడుకోలు


మదనపల్లె టౌన్‌: రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఈ క్రమంలో కుటుంబ పెద్దకు అకస్మాత్తుగా పెద్ద జబ్బు రావడంతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ములకలచెరువు మండలం మద్దినాయునిపల్లె పంచాయతీ చిన్నమొరవపల్లెకు చెందిన ఉత్తన్న కుమారుడు కపిలి వెంకటరమణ(32) డిగ్రీ వరకు చదువుకున్నాడు. వివాహం చేసుకుని బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తూ భార్య, తల్లిదండ్రులను పోషించుకుంటున్నాడు.

ఈ క్రమంలో అనారోగ్యానికి గురికావడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చూపించగా రెండు కిడ్నీలు చెడిపోయాయని వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు కిడ్నీ దానం చేస్తే ఆపరేషన్‌కు రూ.4 లక్షలు ఖర్చువుతుందని  తెలిపారు. నిరుపేదలమైన తాము అంత డబ్బు ఖర్చు పెట్టలేమని, దాతలు ముందుకొచ్చి ఆర్థిక సాయం అందించాలని భార్య అంజలమ్మ కోరుతోంది. సాయం చేయాల్సిన వారు 957319 6473కు సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement