కృష్ణా జిల్లా రాయనపాడు దోపిడీపై పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పందించారు
రాయనపాడు దోపిడిపై స్పందించిన కమిషనర్!
Sep 16 2014 11:12 PM | Updated on Sep 2 2017 1:28 PM
విజయవాడ: కృష్ణా జిల్లా రాయనపాడు దోపిడీపై పోలీస్ కమిషనర్ వెంకటేశ్వరరావు స్పందించారు. నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇలాంటి తరహా ఘటనలే చోటుచేసుకుంటున్నాయనే విషయం తన దృష్టికి వచ్చిందని కమిషనర్ తెలిపారు.
రైల్వే ట్రాక్‌ల పక్కన ఉన్న ఇళ్లనే దుండగులు టార్గెట్ చేస్తున్నారని ఆయన తెలిపారు. రైల్వే ట్రాక్‌ల పక్కన నివాసం ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల, ఇతర వ్యక్తులపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు ఏపీ పోలీసుల కమిషనర్ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement