పాదయాత్రపై నిఘా నేత్రం

police Surveillance cameras in ys jagan Praja Sankalpa Yatra - Sakshi

 వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్రపై అడుగడుగునా నిఘా పెట్టిన ప్రభుత్వం 

 కెమెరాలు, డ్రోన్‌లతో చిత్రీకరణ 

 ఇంటెలిజెన్స్‌ అధికారుల పర్యవేక్షణ

 పాదయాత్ర ముగిసిన ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ

 రోజువారీ నివేదికను సీఎంకు చేరవేస్తున్న ఉన్నతాధికారులు 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. పోలీసులు, ఇంటెలిజెన్స్‌ అధికారులు, చివరకు నారాయణ కళాశాల విద్యార్థులతో పాటు పార్టీ నేతలు కొందరు జగన్‌ పాదయాత్రపై రోజూ నివేదికలు తయారుచేస్తున్నారు. ఆ నివేదికలను ఆయా శాఖల ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబుకు పంపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాటిపై సీఎం చంద్రబాబు ప్రతి రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నట్లు తెలిసింది. వైఎస్‌ జగన్‌ ప్రజా సంకల్పం పేరుతో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు మూడు వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.

 ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్రలో రోజూ రీజనల్‌ ఇంటెలిజెన్స్‌ ఆర్‌ఐవో నరహరి పాల్గొంటున్నారు. వైఎస్‌ జగన్‌ వెళ్లే ప్రాంతానికి ముందుగానే ఆయన చేరుకుని అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించడంతో పాటు ప్రజా స్పందనపై ఆరా తీస్తున్నారు. అక్కడక్కడా ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం కనిపించింది. ఆయా ప్రాంతాల్లో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగిశాక కూడా జనం ఏమనుకుంటున్నారనే దానిపై వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఎస్పీ స్థాయి అధికారి అయిన నరహరితో పాటు మరికొందరు అధికారులు జనంలో కలిసి సీఎం చంద్రబాబు ప్రభుత్వం పట్ల ఎవరెవరు ఏమనుకుంటున్నారనేదానితో పాటు వైఎస్‌ జగన్‌ ఇస్తున్న హామీలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

నిఘా కెమెరాలతో పోలీసులు
పాదయాత్ర మొదటిరోజు కనిపించని నిఘా కెమెరాలు మూడో రోజు నుంచి పోలీసుల చొక్కాలకు వేలాడుతూ కనిపించాయి. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి ప్రభుత్వం నిఘాను పెంచింది. యాత్రకు ఏయే వర్గాల ప్రజలు వస్తున్నారు? ఎవరెవరు జగన్‌ను కలుస్తున్నారు? తదితర వివరాలు తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను నేరుగా చూసేందుకు ప్రభుత్వం పోలీసుల ఖాకీ చొక్కాలకు నిఘా కెమెరాలను ఏర్పాటు చేసింది. కెమెరాలను తగిలించుకున్న పోలీసులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు వచ్చే జనాన్ని చిత్రీకరిస్తున్నారు. టీడీపీ నాయకులు ఎవరైనా వైఎస్‌ జగన్‌ను కలుస్తున్నారా? అనే విషయం తెలుసుకునేందుకు ఈ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు కర్నూలుకు చెందిన ఓ సీనియర్‌ నాయకుడు తన అనుచరులతో చెప్పినట్లు తెలిసింది. మరోవైపు డ్రోన్‌ కెమెరాలతో బహిరంగ సభ దృశ్యాలతో పాటు పాదయాత్రలో భారీగా తరలివస్తున్న జనాలను చిత్రీకరిస్తున్నారు. 

అమరావతిలో ‘లైవ్‌’ 
బహిరంగ సభతో పాటు రోజూ పాదయాత్రకు పోటెత్తుతున్న జనాన్ని డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరిస్తున్నదంతా సచివాలయంలో ప్రభుత్వ పెద్దలు నేరుగా ‘లైవ్‌’లో చూస్త్ను్నట్లు ఓ అధికారి చెప్పారు. ఇంటెలిజెన్స్‌ అధికారులు, పోలీసులు జగన్‌ పాదయాత్రపై రోజూ సాయంత్రానికల్లా నివేదిక సిద్ధం చేసి ఆయా శాఖల ఉన్నతాధికారులకు చేరవేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నారాయణ విద్యా సంస్థల్లోని కొందరు విద్యార్థులను సైతం వినియోగిస్తున్నట్లు తెలిసింది. వీరు  సేకరించిన సమాచారాన్ని నేరుగా మంత్రికే పంపుతున్నట్లు ప్రొద్దుటూరులో శనివారం రాత్రి జరిగిన వైఎస్‌ జగన్‌ బహిరంగసభ వద్ద చర్చించుకోవడం కనిపించింది.

సీఎంకు నివేదిక.. 
వివిధ శాఖలు, ప్రైవేటు వ్యక్తులు జగన్‌ పాదయాత్రపై సేకరించి అమరావతికి పంపిన నివేదికను ఉన్నతాదికారులు సీఎం చంద్రబాబుకు చేరవేస్తున్నారు. రోజూ తెప్పించుకుంటున్న నివేదిక, వీడియోలను సీఎం స్వయంగా చూడటంతో పాటు.. వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఆ నివేదికపై రోజూ రాత్రి ఉన్నతాధికారులతో సీఎం సమీక్షిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరుల్లో జరిగిన భారీ బహిరంగ సభలకు, పాదయాత్రకు అనూహ్యంగా వచ్చిన జనం, వారి నుంచి సేకరించిన అభిప్రాయాలపై శుక్ర, శనివారాల్లో సీఎం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న వ్యతిరేకత.. దానికిగల కారణాలపై విశ్లేషించినట్లు ఓ అధికారి చెప్పారు.

More news

20-11-2017
Nov 20, 2017, 09:03 IST
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా) : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత...
20-11-2017
Nov 20, 2017, 06:54 IST
తమ గ్రామ కాల్వలకు నీళ్లు వదలడం లేదని అమడాలకు చెందిన వినోద్‌రెడ్డి ఆవేదన..  వైఎస్సార్‌సీపీకి ఓటు వేశామని సంక్షేమ పథకాలు  ఇవ్వడం లేదంటూ...
20-11-2017
Nov 20, 2017, 06:45 IST
పత్తికొండ టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిండు మనసుతో ఆశీర్వదించాలని పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు శ్రీదేవి...
20-11-2017
Nov 20, 2017, 06:29 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ‘పేదల కోసమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించింది. వారి సమస్యలను నేరుగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే...
20-11-2017
Nov 20, 2017, 06:25 IST
ఆత్మకూరు: కోవెలకుంట్లకు చెందిన వ్యవసాయ కూలీలు మంగళి లక్ష్మమ్మ, సుబ్బమ్మ, నాగమ్మ, రాములు, లక్ష్మి దేవి, సౌదరదిన్నెకు చెందిన మరియమ్మ,...
20-11-2017
Nov 20, 2017, 06:22 IST
ఆళ్లగడ్డ: ‘టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అణచివేతకు కుట్ర పన్నుతోంది.. ప్రతిపక్షనేతగా మీరు గిరిజనులను ఆదుకోవాలి’ అని ఆల్‌ఇండియా బంజార సేవాసంఘం...
20-11-2017
Nov 20, 2017, 06:18 IST
పత్తికొండ రూరల్‌: ‘నా బిడ్డను ఆశీర్వదించు జగనన్నా’ అని కోవెలకుంట్లకు చెందిన మాధవరెడ్డి, అచ్యుత దంపతులు వైఎస్‌ జగన్‌ను కోరారు....
20-11-2017
Nov 20, 2017, 03:16 IST
19–11–2017, ఆదివారం బనగానపల్లె, కర్నూలు జిల్లా స్తోమతలేని కారణంగా ఏ బిడ్డా చదువు మానకూడదు ఈ రోజు బనగానపల్లె నియోజకవర్గం సౌదరదిన్నెలో 8.30కి సంకల్పయాత్ర ప్రారంభమయింది....
20-11-2017
Nov 20, 2017, 01:20 IST
ప్రజా సంకల్ప యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు నోరుతెరిస్తే అబద్ధాలు.. మోసాలు.. నాలుగేళ్లలో ఒక్క హామీనీ అమలు చేయలేదు.....
19-11-2017
Nov 19, 2017, 21:28 IST
సాక్షి, హైదరాబాద్‌: కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాల అభ్యున్నతే మా ప్రాధాన్యత అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత...
19-11-2017
Nov 19, 2017, 20:18 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు...
19-11-2017
Nov 19, 2017, 19:46 IST
సాక్షి, బనగానపల్లె: ’ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నోరుతెరిస్తే.. 2022, 2029, 2050 అంటున్నారు. ఇప్పటికే ఆయన వయస్సు 70 ఏళ్లు. ఇక,...
19-11-2017
Nov 19, 2017, 15:32 IST
సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా): ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌...
19-11-2017
Nov 19, 2017, 14:09 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగునా...
19-11-2017
Nov 19, 2017, 11:33 IST
సాక్షి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 12వ రోజు...
19-11-2017
Nov 19, 2017, 06:51 IST
కోవెలకుంట్ల: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను...
19-11-2017
Nov 19, 2017, 06:45 IST
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న సదుద్దేశంతో నాడు వైఎస్‌ఆర్‌ ప్రవేశపెట్టిన 104 ఉద్యోగులకు పని భద్రత...
Back to Top