రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన బాలుడు!

Police Saves Child Who Encrusted In Two Walls In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: పట్టణంలోని భవానీపురం లేబర్ కాలనీలో ఆరేళ్ల బాలుడు రెండు గోడల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కుటుంబ సభ్యులను, స్థానికులను కలవరానికి గురిచేసింది. అయితే, భవానీపురం పోలీసుల చొరవతో బాలుడు క్షేమంగా బయటడపటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఊపిరి అందక ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న బాలుడి విషయం తెలియగానే.. భవానీపురం ఎస్సై కవిత శ్రీ,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస రావు, కానిస్టేబుల్‌ చలపతి వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గోడలో ప్రమాదవశాత్తు ఇరుకు పోయిన బాలుడిని చాకచక్యంగా కాపాడారు. భవానీపురం పోలీసులు వేగంగా స్పందించడంతో బాలుడికి ప్రమాదం తప్పిందని స్థానికులు వెల్లడించారు. పోలీసుల సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top