
సాక్షి, నెల్లూరు : ఆ సమస్య ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది. స్పందన కార్యక్రమంలో ఎస్పీకి ఫిర్యాదు అందించగా ఏడురోజుల్లో పరిష్కరించారు. దీంతో బాధితులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నవాబుపేటకు చెందిన కలపాటి మునికృష్ణయ్య, రంగమ్మ దంపతులకు ముగ్గురు ఆడ సంతానం. కృష్ణయ్య సైకిల్ షాప్ నిర్వహిస్తుంటాడు. వారికి తమ పక్కింటి వారితో హద్దులు, నడకదారి విషయంలో ఎనిమిదేళ్లుగా వివాదం ఉంది.
ఈ నేపథ్యంలో ఈనెల 4వ తేదీన ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో దంపతులు తమ సమస్యను ఎస్పీ ఐశ్వర్యరస్తోగి దృష్టికి తెచ్చారు. ఆయన ఆదేశాలతో పోలీసులు సమస్యను పరిష్కరించారు. తమకు సహకరించిన నవాబుపేట పోలీస్‌స్టేషన్ సీఐ వేమారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.