నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు.
కొవ్వూరు: నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద పెన్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను ఆదివారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో కొవ్వూరు ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి ఆకస్మికంగా దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇసుక వ్యాపారులు పెన్నా నది నుంచి రాత్రి సమయాల్లో ఇసుక తరలిస్తుంటారు. స్వాధీనం చేసుకున్న 25టైర్ల వాహనాలను పోలీస్స్టేషన్‌కు తరలించారు.