సీమాంధ్ర ఎంపిలు చేయతలపెట్టిన సంకల్ప దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
హైదరాబాద్: సీమాంధ్ర ఎంపిలు చేయతలపెట్టిన సంకల్ప దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఎల్లుండు ఈ దీక్షను ప్రారంభిస్తారు. ఈ దీక్షలో ఆరుగురు ఎంపిలు పాల్గొనవలసి ఉంది. అయితే ప్రస్తుతం అయిదుగురు ఎంపిలు మాత్రమే పాల్గొననున్నారు. కాంగ్రెస్ లోక్సభ సభ్యులు హర్షకుమార్, లగడపాటి రాజగోపాల్, రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, సాయిప్రతాప్ సంకల్ప దీక్ష చేస్తారు. ఆరోగ్య కారణాల రీత్యా ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దీక్షలో పాల్గొనడంలేదని తెలిసింది.
ఈ దీక్ష సందర్భంగా ఇందిరా పార్కు పరిసర ప్రాంతాలలో పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే దీక్ష రోజున భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
ఇదిలా ఉండగా, ఎంపిలు చేయతలపెట్టిన సంకల్ప దీక్షకు కేంద్ర మంత్రి పల్లంరాజు మద్దతు పలికారు.